PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కీ.శే. ఘంటసాలకు ఘననివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: తెలుగు పాట, భాష అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేసిన మహానుభావుడు ఘంటసాల అని, ఆయన పాట వింటే పసిపిల్లల నుంచి పండు మొసలి వరకు ఆహ్లాదం పొందుతుతారన్నారు డా. డబ్ల్యూ సీతారాం, ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​, పత్తి ఓబులయ్య, హనుమంతరావు చౌదరి. దివంగత ఘంటసాల వర్ధంతి సందర్భంగా శుక్రవారం నగరంలోని చిల్ర్డన్​ పార్క్​ దగ్గరున్న ఘంటసాల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా డా. డబ్ల్యూ సీతారాం, డా. పి. చంద్రశేఖర్​ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా ఘంటసాల గారి భగవద్గీత వినపడుతోందన్నారు. మనస్సు ఆహ్లాదం.. ఆనందంతో పరవశించిపోవాలంటే ఘంటసాల పాట వినకతప్పదన్నారు. కళాకారులు అందరూ కీ.శే. ఘంటసాలను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

About Author