ఏపీ ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ ఆర్థిక వ్యవస్థ కుంగిపోయి ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుంగిపోయి ఉందన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులున్నా.. జగన్ పాలనలో రాష్ట్రం సరైన దిశలో వెళ్తోందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవన్నీ సకాలంలో రావాలని శ్రీవారిని ప్రార్థించానని సజ్జల తెలిపారు.