రెండు వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఎన్సీబీ !
1 min readపల్లెవెలుగువెబ్ : గుజరాత్ తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ నౌకలో 800 కిలోల డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, భారత నేవీ సిబ్బంది స్వాధీ నం చేసుకున్నారు. వాటి విలువ రూ.2 వేల కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. ఆ డ్రగ్స్‌లో 529 కిలోల చరస్, 234 కిలోల మెథంఫేటమైన్, 15 కిలోల హెరాయిన్ ఉన్నాయన్నారు. పాకిస్థాన్‌లో వీటిని లోడింగ్ చేసి ఉండవచ్చన్నారు. భారీ జనుపనార సంచుల్లో వాటిని ప్యాక్ చేసి పోర్‌బందర్ ఓడరేవు వైపు తీసుకురాగా.. నేవీ సిబ్బంది సాయంతో 4 రోజుల ఆపరేషన్ నిర్వహించి స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నేవీ కమాండోలను చూడగానే డ్రగ్స్‌ను తరలిస్తున్న స్మగ్లర్లు ఆ పడవను వదిలి పారిపోయారని తెలిపారు.