శ్రీ వారికి చక్రస్నానం.. గరుడ పక్షుల ప్రదక్షిణ 
1 min readహరిహరక్షేత్రంలో బ్రహ్మోత్సవాల ప్రత్యేకత
రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: పవిత్ర తుంగానదీ తీరంలో వెలిసిన శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయని, ఇందుకు నగర బ్రాహ్మణ సంఘం ఎంతో కృషి చేసిందన్నారు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. నగరంలోని హరిహర క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల చక్రస్నానం సందర్భంగా గరుడ పక్షులు ప్రదక్షిణలు చేయడం ఇక్కడి ప్రత్యేకతన్నారు. ఈ సందర్భంగా ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 1982 సంవత్సరాల్లో టీజీవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. దేవాలయ నిర్మాణానికి, బ్రహ్మోత్సవాల నిర్వహణకు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ రోజు చక్రస్నానం గరుడ పక్షులు వచ్చి ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఇక్కడి ప్రత్యేకత.. ప్రతి సంవత్సరం కూడా పక్షులు ఇలా రావడం అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయం.. అలాగే తుంగభద్ర నది కూడా ఎంతో విశిష్టమైనది, ఒకసారి తుంగభద్రనీరు సేవిస్తే, కోటి మార్లు గంగా స్నానమాచరించినంత పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.. అటువంటి పుణ్య నదీ తీరాన ఉన్నటువంటి ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం గరుడ పక్షులు రావడం అనేది ఎంతో ఆనందించదగ్గ విషయం.. ప్రపంచంలో ఎక్కడా జరగని ఇటువంటి దృశ్యాలను ప్రతి ఒక్కరూ వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను.