PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స‌ర్కారు వారి పాట లీక్.. త‌మ‌న్ భావోద్వేగం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌ర్కారు వారి పాట సినిమాలో పాట లీకైంది. పాట లీక్ అవ్వ‌డం పై సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ భావోద్వేగంతో స్పందించారు. “ మనసైతే చాలా బాధగా ఉంది. ఆరు నెలలుగా ఈ పాట వీడియో కోసం ఎంతెతో కష్టపడ్డాం. రాత్రి, పగలు పని చేశాం. ఈ పాట షూటింగ్‌ సమయంలో 9మందికి కరోనా పాజిటీవ్‌ కూడా వచ్చింది. మేము మా హీరోగారికి చూపించిల్సిన ప్రేమ, మా అబిమానం. మా పాటలో ఉండే ప్రాణం. మా కవి రాసిన అద్బుతమైన లిరిక్స్‌. మా డైరెక్టర్‌ గారు ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా చేసిన లిరికల్‌ వీడియో. మేం ఎంతో హ్యాపీగా వరల్డ్‌లోనే బెస్ట్‌ ప్లేస్‌, మాస్టరింగ్‌, మిక్సింగ్‌ టెక్నాలజీ వాడాం ఈ పాట కోసం “ అని త‌మ‌న్ భావోద్వేగంతో మాట్లాడారు. మ‌రోవైపు పాట లీకవ్వ‌డం ప‌ట్ల మ‌హేష్ బాబు అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

                                         

About Author