చాయ్ తాగి చనిపోయారు..!
1 min readజనగామ: ఒక మహిళ టీపొడి అనుకుని టీలో ఎండ్రిన్ గుళికలు వేసింది. టీ తయారు చేసింది. ఇంట్లో వారికి కూడ టీ ఇచ్చింది. అందరూ టీ తాగారు. కొద్ది సేపటికే ఒంట్లో ఏదో తెలియని బాధ మొదలైంది. దాసరం అంజమ్మ అనే మహిళ టీ తాగిన తర్వాత కొద్దిసేపటికే చనిపోయింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించారు.ఈ విషాద ఘటన జనగామ జిల్లా బచ్చన్న పేట మండలం రామచంద్రాపురంలో చోటుచేసుకుంది. దాసరం మల్లయ్య, దాసరం భిక్షపతిల పరిస్థితి విషమంగా ఉంది. వీరు ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఈ ఘటన జరిగింది.