‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ’ గుర్తింపు పొందిన డా.చంద్రశేఖర్
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు గవర్నమెంటు జనరల్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగాన్ని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్ది… రెండు దశాబ్దాలుగా వేలాది రోగులకు వైద్యసేవలు అందించిన ప్రముఖ గుండె వైద్యనిపుణులు డా. చంద్రశేఖర్‌ను లండన్‌కు చెందిన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ “సర్టిఫికెట్ ఆఫ్ కమిట్మెంట్ అవార్డు వరించింది. ఈ విషయం ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ జాయింట్ సెక్రెటరీ ఎలియాజర్ స్వయంగా ప్రకటించారు. కోవిడ్ ఫస్ట్ వేవ్‌లో రోగులకు అండగా నిలబడుతూ.. వైద్యసేవలతో వారి ప్రాణాలకు భరోసాగా నిలిచిన గుండె వైద్యనిపుణులు డా. చంద్రశేఖర్ సేవలు అద్వితీయమని ప్రశంసించారు జాయింట్ సెక్రెటరీ ఎలియాజర్. సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని కార్డిలయాలజీ విభాగం కాన్ఫరెన్స్ హాల్ సంస్థ జాయింట్ సెక్రెటరీ, సౌత్ ఇండియా ఇంఛార్జి శ ఎలియాజర్ ఆధ్వర్యంలో డా. చంద్రశేఖర్‌కు అవార్డు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమానికి జిల్లా జడ్జి శ్రీ రాధాకృష్ణ కృపాసాగర్ ముఖ్య అతిథిగా విచ్చేయున్నారు.