అవగాహనతోనే… ఫిట్స్ నియంత్రణ : డా. హేమంత్
1 min read- 50 మందికి ఫిట్స్ ఉచిత వైద్యపరీక్ష
పల్లెవెలుగు వెబ్:అంతర్జాతీయ ఫిట్స్ (మూర్ఛవ్యాధి) దినోత్సవం సందర్భంగా సోమవారం కర్నూలు హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉచిత వైద్యశిబిరంలో నిర్వహించారు ప్రముఖ నరముల వైద్యనిపుణులు డా. హేమంత్ కుమార్ ఎండి, డీఎం. కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 50 మంది వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్యపరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఉచితవైద్యశిబిరంలో రోగులకు పలు వైద్యచికిత్సలు చేశారు. అనంతరం రోగులకు ఫిట్స్‌పై అవగాహన కల్పించారు. ఫిట్స్ నియంత్రణకు ఎన్నో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. మందులతో తగ్గని ఫిట్స్‌కు సర్జరీ, ఫేస్‌మేకర్‌తో తగ్గించే వీలుందని, ఫిట్స్‌తో బాధపడుతున్న పురుషులైనా. స్త్రీలైనా పెళ్లీల్లు చేసుకోవచ్చన్నారు. మందులు వాడితే కంట్రోల్ ఉంటుంది. గర్భిణిగా ఉన్నప్పుడు ఫిట్స్ మందులు వాడొచ్చని దీని వల్ల తల్లికీ, బిడ్డకు ప్రమాదం ఉండదని ఈ సందర్భంగా ప్రముఖ నరముల వైద్యనిపుణులు డా. హేమంత్ కుమార్ ఎండి, డీఎం.రోగులకు వివరించారు. కార్యక్రమంలో కర్నూలు హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.