యాత్రికులతో.. అధిక చార్జీలు వసూలు చేయొద్దు : ఎస్ఐ
1 min readపల్లెవెలుగువెబ్, మహానంది: మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే యాత్రికుల వద్ద అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్ఐ నాగార్జున రెడ్డి. సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో లాడ్జి యజమానులతో సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ లాడ్జి యజమానులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితేచర్యలు తప్పవన్నారు. ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని అలాంటివి మరల పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పురస్కరించుకుని భక్తుల నుండి అధికంగా బాడుగ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సాధారణంగా ప్రతి రోజూ తీసుకొనే విధంగానే యాత్రికుల నుండి తీసుకోవాలని ,యాత్రికులతో మర్యాదగా ప్రవర్తించాలని ఎస్సై నాగార్జున రెడ్డి లాడ్జి యజమానులకు సూచించారు చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.