దళాలను వెనక్కిరప్పించిన రష్యా.. ఉద్రిక్తతకు చెక్
1 min readపల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి కొన్ని సేనలను ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా మంగళవారం ప్రకటించింది. అమెరికా అనుకూల ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేస్తుందనే భయాల నేపథ్యంలో ఈ చర్యను ప్రకటించింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 1 లక్ష మందికిపైగా దళాలను రష్యా మోహరించిన సంగతి తెలిసిందే. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఐగర్ కొనషెంకోవ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, ఉక్రెయిన్ సరిహద్దుల్లో తమ దళాల విన్యాసాలు పూర్తయ్యాయని, తిరిగి తమ స్థావరాలకు చేరుకుంటున్నాయని చెప్పారు. సదరన్, వెస్టర్న్ మిలిటరీ డిస్ట్రిక్ట్స్ యూనిట్లు వాటి పనిని పూర్తి చేశాయన్నారు. అవి రైలు, రోడ్డు మార్గాల్లో ప్రయాణం ప్రారంభించాయని చెప్పారు. అవి తమ మిలిటరీ గారిజన్లకు వెళ్తున్నట్లు తెలిపారు.