సొంత సోషల్ మీడియా ఏర్పాటు చేసిన ట్రంప్ !
1 min readపల్లెవెలుగువెబ్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా ఏర్పాటు చేశారు. దీనికి ట్రూత్ సోషల్ అనే పేరు పెట్టారు. ఈ వేదికపై ఆయన పోస్ట్ చేసిన తొలి సందేశం స్క్రీన్ షాట్‌ను ఆయన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ షేర్ చేశారు. డొనాల్డ్ ట్రంప్‌ను ఫేస్‌బుక్, ట్విటర్ ఓ ఏడాది క్రితం నిషేధించాయి. దీంతో ఆయన సొంతంగా ట్రూత్ సోషల్ అనే ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు. ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ కంపెనీ దీనిని అభివృద్ధిపరచింది. దీనిపై ఆయన ఇచ్చిన తొలి పోస్ట్‌లో, ‘‘గెట్ రెడీ, మీకు ఇష్టమైన అధ్యక్షుడు మిమ్మల్ని త్వరలో కలవబోతున్నారు’’ అని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌పై అందుబాటులో ఉంది. మార్చిలో ఇది లైవ్‌లోకి వస్తుంది. ఈ వివరాలను ఈ సోషల్ మీడియా కంపెనీ సీఈఓ డెవిన్ నునెస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.