ఆ ఇద్దరు హీరోలే ట్రోల్స్ చేయిస్తున్నారు !
1 min readపల్లెవెలుగువెబ్ : తన పై సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ పై ప్రముఖ నటుడు మోహన్ బాబు స్పందించారు. ‘ట్రోల్స్, మీమ్స్ అనేవి సరదాగా నవ్వుకునేలా ఉండాలి. కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. సాధారణంగా నేను ట్రోలింగ్స్, మీమ్స్‌ను పట్టించుకోను. ఎవరైనా నాకు పంపినప్పుడే చూస్తాను. అయినా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల ఇవి హద్దులు మీరుతున్నాయి. ఇలాంటి వాటిని చూసినప్పుడు బాధగా ఉంటుంది. ఎదుటి వారిని ట్రోలింగ్ చేయొచ్చేమో నాకు తెలియదు.. కానీ వ్యగ్యంగా ట్రోల్ చేయడం అనేది బాధాకరంగా ఉంటుంది” అని అన్నారు. ‘నా మీద ఇద్దరు హీరోలు ట్రోలింగ్ చేయిస్తున్నారు. ఇద్దరు హీరోలు యాబై నుంచి వంద మందిని ప్రత్యేకంగా నియమించుకుని నన్ను ట్రోల్ చేయిస్తున్నారు. వాళ్లెవరో కూడా తెలుసు. వారిని ప్రకృతి గమనిస్తోంది. ఇప్పుడు వారికి బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తారు. అప్పుడు వారి వెనుక ఎవరూ ఉండరు’ అంటూ హెచ్చరించారు.