హిజాబ్ పై తస్లీమా నజ్రీన్ సంచలన వ్యాఖ్యలు
1 min readపల్లెవెలుగువెబ్ : బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నజ్రీన్ హిజాబ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్, బుర్ఖా లేదా నిఖాబ్ మహిళల అణచివేతకు చిహ్నాలు అని తస్లీమా పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో రాజుకున్న హిజాబ్ వివాదం దేశంలో ఇతర రాష్ట్రాలకు వ్యాపించిన నేపథ్యంలో తస్లీమా నస్రీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో యూనిఫాం డ్రెస్ కోడ్ ప్రతిపాదన గురించి తస్లీమా నస్రీన్ మాట్లాడుతూ, ‘‘విద్యా హక్కు మతానికి సంబంధించిన హక్కు అని నేను నమ్ముతున్నాను’’ అని అన్నారు. ‘‘హిజాబ్‌ను 7వ శతాబ్దంలో కొంతమంది స్త్రీద్వేషులు పరిచయం చేశారు, ఎందుకంటే ఆ సమయంలో స్త్రీలను లైంగిక వస్తువులుగా పరిగణించేవారు. పురుషులు స్త్రీలను చూస్తే, పురుషులకు లైంగిక కోరిక కలుగుతుందని వారు నమ్ముతారు. కాబట్టి మహిళలు హిజాబ్ లేదా బురఖా ధరించాలి. వారు పురుషుల నుంచి తమను తాము దాచుకోవాలి” అని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా అన్నారు.