NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేసీఆర్ పై వైఎస్ ష‌ర్మిల విమ‌ర్శలు

1 min read

మెద‌క్: సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో 20 క‌రువు మండ‌లాలు ఉన్నాయ‌ని విమ‌ర్శించారు వైఎస్ ష‌ర్మిల‌. ఉమ్మడి మెద‌క్ జిల్లాలో అంద‌రికీ నీళ్లు అందుతున్నాయా? అంటూ వైఎస్ఆర్ అభిమానుల్ని ప్రశ్నించారు. మ‌ల్లన్న సాగ‌ర్ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు ఇంకా ప‌రిహారం పూర్తీ స్థాయిలో అంద‌లేద‌ని విమ‌ర్శించారు. అయిన వారికి ఒక‌ర‌కంగా.. కానివారికి ఒక‌రకంగా న‌ష్టప‌రిహారం ఇవ్వడ‌మేంట‌ని ప్రశ్నించారు. వైఎస్ బ‌తికుంటే.. మెద‌క్ జిల్లా రూపురేఖ‌లే మారిపోయేవ‌ని అన్నారు. హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ నివాసంలో ఆమె మెద‌క్ జిల్లా వైఎస్ఆర్ అభిమానుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ‌లో వైఎస్ క‌ల‌లుక‌న్న రాజ్యం తీసుకురావాల‌నుకుంటున్నట్టు.. అందుకు వైఎస్ఆర్ అభిమానులు స‌హ‌క‌రించాల‌ని ఆమె కోరారు.

About Author