అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దన్నందుకే హత్య చేశారు !
1 min readపల్లెవెలుగువెబ్ : వివేకానంద రెడ్డి హత్య పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అవినాష్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దన్నందుకు మాజీమంత్రి వివేకానందరెడ్డిపై కక్షగట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మాజీమంత్రి పరిటాల రవి హంతకులను ఒక్కొక్కర్ని చంపేశారని తెలిపారు. సీఎం జగన్ నేరాలు, ఘోరాలు చేస్తూ హత్యారాజకీయాలు చేస్తే ఎలా..? అని ప్రశ్నించారు. బాబాయిని చంపి టీడీపీ మీద విమర్శలు చేశారని దుయ్యబట్టారు.