జగ్గారెడ్డి రాజీనామా ?!
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం. తాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దూరం అవుతున్నదీ వివరిస్తూ.. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉంది. తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి సొంతంగా పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా.. కాంగ్రె్‌సను వీడాక తాను ఏ పార్టీలోనూ చేరేది లేదని, స్వతంత్రంగానే వ్యవహరిస్తాననీ తన సన్నిహితులతో చెబుతున్నట్టు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్ అధిష్ఠానం, సోనియాగాంధీ కుటుంబంపైన మొదటి నుంచీ తన విధేయతను ప్రకటిస్తూ వస్తున్న జగ్గారెడ్డి.. టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి నియామకం పట్ల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.