చదువులేకపోయినా.. కార్ల కంపెనీలో ఉద్యోగం
1 min readపల్లె వెలుగు వెబ్: “చదువులేక పోయినా.. కార్ల కంపెనీలో ఉద్యోగం” శీర్షిక చదివి ఆశ్చర్యపోయారా? లేక అబద్ధం అనుకుంటున్నారా? లేదా కలలో చదివిన వార్త అనుకుంటున్నార?. మీరు చదివిన శీర్షిక వంద శాతం నిజం. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా. టెస్లా కంపెనీ ప్రపంచ ధనికుల్లో ఒకరైన ఎలన్ మస్క్ ది. ఈ కంపెనీ డిగ్రీ పూర్తీ కాకపోయినా.. సరే యువతకు ఉద్యోగాలు ఇస్తామంటోంది. కాలేజీలో చదవకపోయినా పర్లేదు.. ఉద్యోగాలిస్తామన్న టెస్లా నియామకాల డైరెక్టర్ క్రిస్ లీ ప్రకటిన సంచలనం రేపింది. టెక్సాస్ లోని ఆస్టిన్ లో తమ కర్మాగారంలో ఏకంగా 10 వేల మందికి ఉద్యోగాలిస్తామని టెస్లా ప్రకటించింది. హైస్కూల్ విద్యార్థులు టెస్లాలో ఉద్యోగం చేస్తూనే.. కాలేజీ చదువు పూర్తీ చేయవచ్చని టెస్లా ప్రకటించింది.