విద్యార్థులు లక్ష్యంతో చదవాలి:ఎస్‌ఐ రమణయ్య
1 min readపల్లెవెలుగు వెబ్, చాగలమర్రి: విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో చదివి ఉన్నత శిఖిరాలు అధిరోహించాలని ఎస్‌ఐ రమణయ్య కోరారు.శనివారం మండలం లోని చిన్నవంగలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9,10 వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సు ముగింపు సమావేశానికి ఎస్‌ఐ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే మనం ఎలాంటి కోర్సులు ఎన్నుకోవాలి , ఏకోర్సు చేస్తే ఏ ఉద్యోగం వస్తుందో తెలుసుకుని భవిష్యత్తులో స్థిరపడేలా ఏపీ కెరీర్ గైడెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. . విద్యార్థులు విద్యార్థి దశ నుంచే కెరీర్ పైన దృష్టి సాధించడానికి స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి కెరీర్ గైడెన్స్ ఉపయోగపడుతుందన్నారు. ఉద్యోగం మరియు ఉపాధి అవకాశాలు పొందడానికి కెరీర్ గైడెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రసంసా పత్రాలను, పతకాలను ఎస్‌ఐ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ నాగేంద్ర కుమార్, ఉపాధ్యాయులు ,సుబ్బారాయుడు,శివ శంకర్,విజయ్ కుమార్ , పి డి నాగేంద్ర , నాగరాజు, రాజ్ కుమార్ ,లక్ష్మయ్య వెంకటేశ్వర్లు ,ఇజాజ్, హెడ్ కానిస్టేబుల్ బలరాం,జిఎమ్‌ఎస్‌కే వీరేశ్వరి,విద్యార్థులు పాల్గొన్నారు.