తప్పెట కళాకారులను ఆదుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్: తప్పెట కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆ సంఘం కొమ్మరమేష్. సోమవారం ఆస్పరి మండల కేంద్రంలో తప్పేట కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పరగొండ జోజి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు కార్డు ఐడెంటి అని చెప్పి కళాకారుల పెన్షన్ తొలగింపు కు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలకు వెంటనే నిలిపివేయాలని అలాంటి ఆలోచన చేస్తే రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని గద్దె దింపి సత్తా నా సంఘానికి ఉందని అలాంటి ఆలోచన పునరావృతం కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని అలాగే ప్రతి కళాకారులకు ఇంటి స్థలాలు కేటాయించాలని అలాగే మూడెకరాల భూమి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ప్రతి కళాకారునికి డ్రెస్సులు గజ్జలు ఇచ్చి కళాకారుల నైపుణ్యాన్ని కాపాడవలసిన బాధ్యత సీఎం జగన్ గారికి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సుంకన్న , ఆదోని మండలం అధ్యక్షుడు పులి రాజు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.