భార్యాభర్తల వివాదం.. 24 గంటల్లో పరిష్కారం
1 min readపల్లెవెలుగు వెబ్, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం జగన్నాధపురం గ్రామం వై ఎస్ ఆర్ సి పి గ్రామ సర్పంచ్ మాత్రపు కోటేశ్వరరావు సుమారు 12 సంవత్సరాలు కోర్టులో ఉన్న భార్య భర్తల వివాదం కేవలం 2 రోజులలో పరిష్కరించారు. ఇరు వర్గాలతో మాట్లాడి ఒక కొలిక్కి తెచ్చారు,ఇరు వర్గాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక తాటిపైకిచేసి వై ఎస్ ఆర్ సి పి గ్రామ సర్పంచ్ మాత్రపుకోటేశ్వరరావు12సంవత్సరాలలో లాయర్లకు లక్షలు ఖర్చు పెట్టినా గాని జరగని న్యాయం సున్నితంగా పరిష్కరించారు, వారి సమస్య తన న కుటుంబ సమస్యగా భావించి రెండు రోజులలో సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగినందుకు ప్రజా నాయకుడిగా ఎదిగిన వాడిగా గా గ్రామ ప్రజలు కలియుగ పెదరాయుడు గా అభివర్ణిస్తూ అభినందనలు తెలియజేశారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కుటుంబంలో ఒకరినొకరు పరస్పరం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే గుణాన్ని అలవర్చుకోవాలని పదిమందిలో ఉన్నతంగా ఎదగాలన్నారు.