పని మనుషుల సొంతింటి కల.. కోట్ల రూపాయల షేర్ల బహుమతి !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రైవేట్ రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వి. వైద్యనాథన్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. తన ట్రెయినర్, పనిమనిషి, డ్రైవర్‌తో పాటు అయిదుగురికి 9 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చి ఉదారత చాటుకున్నారు. ఈ అయిదుగురి సొంత ఇంటి కల సాకారం చేసేందుకు ఆయన ఈ మేరకు సహాయం చేశారు. వీరెవ్వరితోనూ ఆయనకు బంధుత్వం లేదని స్టాక్ ఎక్సేంజీలకు బ్యాంకు తెలిపింది. వ్యక్తిగత ట్రెయినర్ రమేష్ రాజుకు 3 లక్షల షేర్లు, పనిమనిషి ప్రాంజల్ నర్వేకర్.. డ్రైవర్ అలగర్‌సామికి చెరి 2 లక్షలు, ఆఫీస్ సపోర్ట్ ఉద్యోగి దీపక్ పఠారే మరో పని మనిషి సంతోష్ జోగ్లేకు చెరి 1 లక్ష షేర్లను వైద్యనాథన్ బహుమతిగా ఇచ్చారు.