అంగన్వాడీల అణచివేత నిరంకుశత్వం
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీలో వైసీపీ ప్రభుత్వం అరాచకపాలన కొనసాగిస్తుందని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. అంగన్‌వాడీ, ఆశావర్కర్ల ఉద్యమాన్ని అణచివేయడం నిరంకుశత్వానికి నిదర్శమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే అరెస్ట్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. అంగన్‌వాడీ, ఆశావర్కర్ల న్యాయపర డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలన్నారు. ఆందోళనకు దిగిన మహిళల్ని అరెస్ట్ చేయడం వైసీపీ అరాచకపాలనకు నిదర్శనమన్నారు. అంగన్‌వాడీ, ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.