వైఎస్ వివేక హత్య కేసు.. వెలుగులోకి కొత్త పేర్లు !
1 min readపల్లెవెలుగువెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. గత ఏడాది సెప్టంబర్ 30న సీబీఐకి దస్తగిరి రాసిచ్చిన స్టేట్ మెంట్ లోని వివరాలు ఇవాళ వెలుగులోకి వచ్చాయి. దస్తగిరి స్టేట్మెంట్‌లో తనని భరత్‌యాదవ్ కలిసినట్టుగా దస్తగిరి పేర్కొన్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతారని, తోటలోకి రమ్మంటున్నారని భరత్‌యాదవ్ చెప్పాడని తెలిపారు. సీబీఐ అధికారులు పిలిచారు.. నేను వెళ్తున్నానని దస్తగిరి చెప్పినట్లు వెల్లడించారు. అలాగే మరోసారి ఫోన్‌లో ఇంటి వెనక ఉండే హెలిప్యాడ్ దగ్గరకు భరత్ రమ్మన్నాడని దస్తగిరి పేర్కొన్నారు. అక్కడికి భరత్‌యాదవ్‌తో పాటు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, న్యాయవాది ఓబుల్‌రెడ్డిలు వచ్చారని తన స్టేట్ మెంట్లో పేర్కొన్నాడు. వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకరరెడ్డిలు పంపించారంటూ నువ్వు మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలంలో చెప్పిన అంశాలు చెబితే నీకు మంచి ఆఫర్ అన్నట్లు వివరించాడు. 10.20 ఎకరాల భూమి ఇస్తాం, ఎంతడబ్బు కావాలో చెప్పాలని భరత్, అడ్వకేట్ ఓబుల్‌రెడ్డి అడిగారని స్టేట్మెంట్‌లో దస్తగిరి పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు 25న సీబీఐ ఎదుట, ఆగస్టు 31న జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట స్టేట్మెంట్ దస్తగిరి ఇచ్చారు.