ఐదురోజులు.. రూ. 7.40 లక్షల కోట్లు ఆవిరి !
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యా ,ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ భయాలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొల్పాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా నష్టపోయాయి. గడిచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ మార్కెట్ సంపద రూ.7.40 లక్షల కోట్ల మేర తరిగిపోయింది. ఈ నెల 16న ట్రేడింగ్ ముగిసేసరికి రూ.262.18 లక్షల కోట్లుగా నమోదైన బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్.. మంగళవారం నాటికి రూ.254.78 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే, ఈ ఐదు సెషన్లలో మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 3 శాతం క్షీణించింది.