ఒకసారి ఐలవ్ యూ చెప్పడం లైంగిక వేధింపు కాదు !
1 min readపల్లెవెలుగువెబ్ : మైనర్ బాలికకు ఒకసారి ‘ఐ లవ్ యూ’ అని చెప్పడం చాలా వరకు ప్రేమ భావనను వ్యక్తం చేయడమవుతుందని ముంబైలోని స్పెషల్ కోర్టు తీర్పు చెప్పింది. ‘ఐ లవ్ యూ’ అని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 ఏళ్ళ యువకుడిని నిర్దోషిగా విడుదల చేసింది. నిందితుడు పాల్పడిన ఏ చర్య బాధితురాలి గౌరవ, మర్యాదలకు భంగం కలిగించిందో ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని తెలిపింది. లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం (పోక్సో) ప్రకారం ఈ కోర్టు ఏర్పాటైంది. నిందితుడు బాధితురాలికి ఎక్కడ ‘ఐ లవ్ యూ’ అని చెప్పాడు? ఇతర వివరాలేమిటి? అనే అంశాలపై పదిహేడేళ్ళ బాధితురాలు, ఆమె తల్లి ఇచ్చిన వాంగ్మూలాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి
అని తెలిపింది. ఈ సంఘటన జరిగిన రోజు నిందితుడు ‘ఐ లవ్ యూ’ అని చెప్పాడని బాధితురాలు చెప్పినట్లు గుర్తు చేసింది. నిందితుడు పదే పదే తన వెంటపడి, ‘ఐ లవ్ యూ’ అని చెప్పినట్లు బాధితురాలు చెప్పలేదని పేర్కొంది. ‘ఐ లవ్ యూ’ అని చెప్పిన ఏకైక సంఘటన చాలా వరకు బాధితురాలి పట్ల నిందితుని ప్రేమ భావనను వ్యక్తం చేయడమవుతుందని తెలిపింది.