జగన్ రెడ్డి.. భజన రెడ్డిగా తయారయ్యారు !
1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. జగన్ మోదీకి భజన రెడ్డిగా.. కీలుబొమ్మలా తయారయ్యారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతారా?… ఎంపీలతో రాజీనామా చేయిస్తారా అన్నది జగన్ ప్రభుత్వం తేల్చుకోవాలని అన్నారు. హోదా, వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీతో పాటు రూ.5 లక్షలతో పథకాలు విభజన చట్టంలో ప్రకటించారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రావడంతో అన్ని ఆగిపోయాయన్నారు. బీజేపీ మోసకారితనం… ప్రాంతీయ పార్టీల చేతగానితనం అని వ్యాఖ్యానించారు.

