సేవలు చిరస్థాయిగా నిలవాలి..
1 min readప్రజల నమ్మకం.. వమ్ము చేయొద్దు..
– చైర్మన్, వైస్ చైర్మన్‌కు దిశానిర్దేశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్
పల్లెవెలుగు వెబ్, గూడూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు వర్తింపజేయడంతోపాటు అభివృద్ధి పనులు చేయడంలో ముందుండాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూడురు నగర పంచాయతీ చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ అస్లాంకు సూచించారు. మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్లకు రెండు రోజులపాటు విజయవాడలో నిర్వహించిన వర్క్‌షాపులో గూడురు చైర్మన్, వైస్ చైర్మన్లు సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగా నియమితులైన గూడురు నగర పంచాయతీ చైర్మన్ వెంకటేశ్వర్లు, అస్లాంను అభినందించారు. సేవలు చిరస్థాయిగా నిలిచేలా పాలన అందించాలని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. ప్రభుత్వసంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు చేయడంలో ముందుండాలన్నారు. అనంతరం గూడురులోని ప్రధాన సమస్యలను చైర్మన్, వైస్ చైర్మన్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గూడూరు నగర పంచాయతీలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని, పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా డంపు యార్డ్ ఏర్పాటు చేయాలని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి సహకరించాలని చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ అస్లాం సీఎంను కోరారు. ఇందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు చైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ అస్లాం తెలిపారు.