యుద్ధం మొదలైంది !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించింది. ఉక్రెయిన్‌లోకి రష్యా సైన్యం ప్రవేశించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ దేశంపై మిలటరీ ఆపరేషన్ మొదలైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్న పుతిన్ ఇప్పటికే చెప్పారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ దేశం ఎమర్జెన్సీ విధించింది. ఉక్రెయిన్ ప్రభుత్వం రష్యాకు దీటుగా బలగాలు సిద్ధం చేసుకుంది. రష్యా దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. రష్యా బాంబు దాడులతో కైవ్, ఖార్కివ్ నగరాల్లో పేలుళ్ల శబ్ధం వినిపించింది.తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడితో అట్టుడికింది. ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో ప్రత్యేక సైనిక చర్య నిర్వహించడానికి రష్యన్ దళాలకు అధికారం ఇచ్చామని వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్ నుంచి వస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నామని పుతిన్ అన్నారు.