యుద్ధం.. మూతపడిన మాస్కో మార్కెట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో మాస్కో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిలిచిపోయింది. పెట్టుబడిదారుల ట్రేడింగ్‌పై నిషేధం విధించారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రభావం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్‌లో కనిపిస్తోంది. ఈ దిగజారుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రష్యాలోని మాస్కో ఎక్స్ఛేంజ్ అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు రష్యన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఉండదు. షేర్లు కొనలేరు, అమ్మలేరు. అదే సమయంలో, స్టాక్ మార్కెట్‌లో ఇతర రకాల ట్రేడింగ్ కార్యకలాపాలు నిషేధించారు.