ఉక్రెయిన్ కు హ్యాండిచ్చిన నాటో !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ కు నాటో హ్యాండిచ్చింది. యుద్ధంపై నాటో కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌కు నాటో బలగాలను పంపే ఆలోచన ఇప్పట్లో తమకు లేదని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ప్రకటించారు. ఉక్రెయిన్‌లో నాటో బలగాలు లేవని, వాటిని మోహరించే ఆలోచనలు, ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. నాటో ప్రకటనతో.. ఇప్పటికే రష్యా దాడులతో చాలా ప్రాంతాల్లో విధ్వంసానికి గురైనా ఉక్రెయిన్ షాక్ తగిలింది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇంతకు మించి స్పందించలేమని జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ విషయంలో రాజకీయం చర్చలు జరిపి సమస్యను సద్దుమణిగేందుకు రష్యా ముందుకురాలేని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే రష్యా అన్ని రాజీ మార్గాలను మూసేసిందని మండిపడ్డారు.