కనిష్ఠాల వద్ద మద్దతు.. లాభాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగియడంతో దేశీయ మార్కెట్లు అదే బాటపట్టాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. రష్యా పై అమెరికా పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో సూచీల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. అమెరికా ఆంక్షలతో రష్యాను కొంతమేర కట్టడి చేయొచ్చన్ని సంకేతాలు వెలుడుతున్నాయి. దీంతో కనిష్ఠాల వద్ద సూచీల్లో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ పై దాడి చేసింది. ఈ దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు. 12 గంటల సమయంలో సెన్సెక్స్ 1344 పాయింట్ల లాభంతో 55873 వద్ద, నిఫ్టీ 412 పాయింట్ల లాభంతో 16664 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.