కొత్తపార్టీ పెట్టాలా ? వద్దా ?.. కార్యకర్తల్ని అడిగిన జగ్గారెడ్డి !
1 min readపల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసే వరకు తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాజీనామా చేయాలా? సొంత పార్టీ పెట్టాలా..? అని జగ్గారెడ్డి కార్యకర్తలను అడగ్గా, కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని వారు సూచించడం గమనార్హం. అయితే రానున్న రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తాను తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరుకోవడం లేదని జగ్గారెడ్డి కార్యకర్తలు, అనుచరులనుద్దేశించి వ్యాఖ్యానించారు.