సీఎం ఇలా చేస్తారని ఊహించలేదు !
1 min readపల్లెవెలుగువెబ్ : భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్బంగా ఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహార్ తీవ్రవిమర్శలు చేశారు. సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వ తీరు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. పవన్ కల్యాణ్ సినిమా విడుదలైన థియేటర్లలో ప్రభుత్వ సిబ్బందిని నియమించడం బాధాకరమన్నారు. సినిమాకు వచ్చేవారిని భయబ్రాంతులకు గురిచేసేందుకు ఉద్యోగులను థియేటర్ల వద్ద ఉంచారని మండిపడ్డారు. సీఎం జగన్మోహాన్రెడ్డి ఇలాంటి పరిపాలన అందిస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. ఆత్మాభిమానానికి, అహాంకారానికి మధ్య జరిగిన పోరాటామే భీమ్లానాయక్ సినిమా ఇతివృత్తమన్నారు.