PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెళ్లైన కొద్దిసేప‌టికే.. యుద్ధ భూమిలోకి… !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్‌కు చెందిన యారినా అరివా, స్వియాటోస్లావ్ ఫర్సిన్ ఒక‌రినొక‌రు ప్రేమించుకున్నారు. తమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి, మే 6న బంధుమిత్రుల సమక్షంలో కొత్త జీవితంలోకి గ్రాండ్‌గా అడుగుపెడదాం అని భావించారు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. భీకర పరిస్థితుల్లో చావైనా.. బతుకైనా కలిసే ఉండాలని భావించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలు పెట్టిన రోజే.. ఈ ప్రేమికులు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఆ తర్వాత కొద్ది సమయానికే స్థానికంగా ఉన్న డిఫెన్స్ సెంటర్‌కు వెళ్లి, దేశ రక్షణ కోసం తుపాకులు చేతబట్టారు. ‘పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. మా మాతృభూమి కోసం ఫైట్ చేయాలని బయల్దేరాం. ఈ పోరాటంలో మేము చనిపోవచ్చు. కానీ చనిపోవడానికి ముందు మేమిద్దరం ఒక్కటవ్వాలనుకున్నాం. దేశ రక్షణ కోసం చేయాల్సిందంతా చేసి తీరతాం’ అని ఈ నవదంపతులు చెబుతున్నారు.

                               

About Author