రావణ వాహనసేవలో ఉత్సవమూర్తులు..
1 min readశ్రీశైలం: శ్రీ స్వామి అమ్మవార్లకు రావణ వాహనసేవ జరిపించబడుతుంది. ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించబడుతాయి. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం జరుగనున్నది. కోలాటం, చెక్కభజన, రాజబటులవేషాలు, జాంజ్ పథక్, జానపద పగటి వేషాలు, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, తప్పెటచిందు బీరప్పడోలు, చెంచునృత్యం, నందికోలసేవ, ఢమరుకం, చితడలు, శంఖం, పిల్లన్నగోని తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేయబడ్డాయి.. ఈ కార్యక్రమంలో ఈవో లవన్న ఆలయ అర్చకులు వేద పండితులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.