పట్టువస్త్రాల సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం..
1 min readశ్రీశైలం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సమర్పణ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ అధికారులు, అర్చకస్వాములు, వేదపండితులు తదితరులు మంత్రివర్యులకు మరియు ఎమ్మెల్యే కుస్వాగతం పలికారు. ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. సంప్రదాయాన్ని అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం ఏటా మహాశివరాత్రి మరియు దసరా మహోత్సవాలలోనూ శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను అనవాయితీగా సమర్పిస్తోంది. ఈ కార్యక్రమములో దేవదాయశాఖ అదనపు కమిషనర్ (ఎఫ్. ఎ.సి) మరియు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్. చంద్రశేఖర అజాద్, ఈఓ ఎస్. లవన్న, పలువురు దేవస్థానం యూనిట్ అధికారులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.