జొహరాపురం వాసుల కల నెరవేరింది… : కలెక్టర్
1 min readఅట్టహాసం…జొహరాపురం వంతెన ప్రారంభోత్సవం..
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: దేశంలోనే కర్నూలును పరిశుభ్రనగరంగా తీర్చిదిద్దాలని, అందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కలెక్టర్ పి. కోటేశ్వరరావు. ఆదివారం జొహరాపురం నుంచి జమ్మిచెట్టు వరకు హంద్రీ నదిపై నిర్మించిన వంతెనను ప్రత్యేక పూజలు చేసి కలెక్టర్, కర్నూలు ఎమ్మెల్యే, నగర మేయర్ లు సంయుక్తంగా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ లతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ….హంద్రీ నది పై అసంపూర్తిగా ఉన్న జొహరాపురం వంతెనను ఆగస్టు మాసంలో పరిశీలించినప్పుడు కర్నూలు ఎమ్మెల్యే, నగర మేయర్ చాలా సూచనలు ఇచ్చి జొహరాపురం వాసులకు ఈ వంతెన చాలా అవసరమని, ఈ వంతెన పనులను వేగవంతం కోసం ప్రత్యేక చొరవ చూపారన్నారు. అందులో భాగంగా జొహరాపురం వంతెనను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కర్నూలు నగరానికి కావాల్సిన మంచినీటి సదుపాయం, కర్నూలు నగరం స్వచ్ఛ స్వరక్షణ, కర్నూలు నగరం మన అందరిదీ కనుక ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి క్లీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరం దేశంలోనే పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడానికి మనం అందరం కలిసికట్టుగా పని చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
బడ్జెట్ కేటాయింపులో.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
గత ప్రభుత్వంలో జొహరాపురం వంతెన మంజూరు చేయడం జరిగింది. కానీ వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. జొహరాపురం వాసుల కష్టాలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. హంద్రీ నది పై వంతెన త్వరగా నిర్మించాలని ఫైనాన్స్ క్లియర్ చేశారు. వంతెన నిర్మాణం పూర్తికావడంతో జొహరాపురం వాసుల చిరకాల కోరిక నెరవేరింది.
190 నుంచి 70వ ర్యాంకు.. : నగర మేయర్ రామయ్య
నగరాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతోనే నగర సుందరీకరణ, క్లిన్ ఆండ్ గ్రీన్ సిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. త ప్రభుత్వం జొహరాపురం వంతెన పనులను ప్రారంభించారే తప్ప పనులు పూర్తి చేయలేదు. ఈ ప్రభుత్వం జొహరాపురం వాసుల కష్టాలను తెలుసుకొని వంతెన పనులను పూర్తి చేసింది సంక్షేమంతో పాటు అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధిపైన రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక దృష్టి ఉందని, రాబోయే రోజుల్లో న్యాయ రాజధాని కాబోతోంది, హైకోర్టు కూడా కర్నూలుకు రాబోతోంది అన్నారు. ఇప్పటికే కర్నూలు కార్పొరేషన్లో అభివృద్ధి విషయంలో చాలా మార్పులు గమనించారన్నారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, అందరి సహకారంతో కర్నూలు కార్పొరేషన్ క్లీన్ అండ్ గ్రీన్ లో స్వచ్ఛ సర్వేక్షన్ లో ఎక్కడో 190 ర్యాంకులో ఉన్న కర్నూలును 70 ర్యాంక్ లోకి తీసుకురావడం జరిగిందన్నారు. రాబోయే సంవత్సరానికి క్లీన్ అండ్ గ్రీన్ లో కర్నూలు నగరం దేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో కూడా మొదటి స్థానంలో ఉండేందుకు అందరం శయశక్తులా కృషి చేద్దాం అన్నారు. కర్నూలు ఒక అందమైన నగరంగా, పొల్యూషన్ లేని నగరంగా, పచ్చదనంగా ఉండేలా ఖచ్చితంగా తీర్చిదిద్దుతమని నగర మేయర్ అభివర్ణించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, కార్పొరేటర్లు, ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.