విద్యా,ఉపాధి కల్పన..ప్రభుత్వానిదే.. : బీసీ ఎస్ఎఫ్
1 min readగుంటూరు: విద్యార్థులకు విద్య, యువతకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు బిసి స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ బాబు. ఆదివారం గుంటూరులో బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రూపొందించిన గోడ పత్రికను obc కులాల జనగణన సాధన అనే అంశం పై జరిగిన బీసీ సంఘాల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది YK గారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ ” బీసీలను ఉన్నత విద్యకు దూరం చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు బీసీలకు నాణ్యమైన విద్య ఉపాధి అవకాశాలను దూరం చేస్తున్నాయని, బీసీలు విద్యాపరంగా ఆడే అన్ని రంగాల్లో రాణించాలని ముఖ్యంగా రాజకీయ రంగంలో బిసి అవుతా చురుకైన పాత్ర వహించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ బాబు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాక వెంగల రావు, బీసీ యూత్ కన్వీనర్ సైతం రాజశేఖర్, బిసి నాయకులు అన్నా రామచంద్ర యాదవ్, ఆల వెంకటేశ్వర్లు, పల్నాడు రాజు, మురళి, నక్క రవి, శ్రీకాంత్ పాల్గొన్నారు.