NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

య‌డ్ల‌పాటి లేని లోటు పూడ్చ‌లేనిది : లోకేష్‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీడీపీ సీనియ‌ర్ నేత య‌డ్ల‌పాటి వెంక‌ట్రావు మృతి పై టీడీపీ నేత నారా లోకేష్ సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న లేని లోటు పూడ్చ‌లేనిద‌ని అన్నారు. పార్టీకి ఆయ‌న విలువైన సేవ‌ల్ని అందించార‌ని అన్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న సంతాపం ప్ర‌క‌టించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు గారి మరణం విచారకరం. పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం ఆశయాల సాధన కోసం కృషి చేశారాయన. వయోభారంతో కొంతకాలం నుండి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు తన అభిప్రాయాలను, సలహాలను అందించేవారు. రాజధాని అమరావతి నిర్మాణం తలపెట్టినప్పుడు యడ్లపాటి వెంకట్రావు గారు ఎంత సంతోషించారో, ప్రజా రాజధాని ఎటూ కాకుండా పోయినప్పుడు ఒక తరం ప్రతినిధిగా అంత బాధపడ్డారు. వెంకట్రావుగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని పోస్ట్ చేశారు.

About Author