PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెల్లంప‌ల్లి శ్రీనివాస్, కొడాలి నాని హీరోలుగా సినిమా తీయండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సినిమా టికెట్ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వ తీరుపై మెగాబ్ర‌ద‌ర్ నాగబాబు మండిప‌డ్డారు. త‌మ‌కు న‌చ్చని వారి బిజినెస్ దెబ్బ‌తీయాల‌నుకోవ‌డం స‌రికాద‌న్నారు. మీకున్న పర్సనల్ ఎజెండా పవన్ కళ్యాణ్ ని అణగ తొక్కెయ్యలని, మీకు పడని వర్గం వాళ్ల హీరోల ఆర్థిక మూలాలను కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. దానికోసం సినిమా ఇండస్ట్రీ మీద పడ్డారు. ఆంధ్రలో ఎవ్వరూ ఏ వ్యాపారం చేసుకున్న ఆ వ్యాపారాన్ని మీరే తిసేసు కుంటున్నారు. మీరే వెల్లంపల్లి శ్రీను, కొడాలి నాని లాంటి వాళ్ళను హీరోలుగా పెట్టీ సినిమాలు తియ్యండి.దాని వల్ల ఆంధ్రలో సినిమా ఇండస్ట్రీ డవలప్ అవుతుంది. మీ ఎమ్మెల్యేలు, ఎంపిల ముందు మేము మంచి నటులం కాదు. తెలుగు సినిమాని ఆంధ్రలో బ్యాన్ చెయ్యండి. మాకు నష్టం లేదు. టెక్నాలజీ డెవలప్ అయ్యింది. యూట్యూబ్ లో, ఓటిటి లతో డిజిటల్ లోనో మాకు డబ్బులు వస్తాయి. అని అన్నారు.

                                       

About Author