ఆ హత్యా ఘటనతో.. జగన్ నైతికంగా పతనమయ్యారు !
1 min read
పల్లెవెలుగువెబ్ : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్యలో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందన్నారు. వివేకా హత్యను తనపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారని, బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారన్నారు. హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తే… ఏమవుతుంది?… 12వ కేసు అవుతుందని జగన్ వ్యాఖ్యానించడమంటే అతనికి చట్టం అంటే లెక్కలేనితనాన్ని స్పష్టం చేస్తోందన్నారు.