సెబీ చైర్మన్ గా మాధబి పూరి
1 min readపల్లెవెలుగువెబ్ : సెబీ చైర్మన్ గా మాధబి పూరీ నియమితులయ్యారు. సెబీ ప్రస్తుత చైర్మన్ అజయ్ త్యాగి పదవీ కాలం సోమవారంతో ముగిసింది. ఆయన ఐదేళ్లపాటు చైర్మన్‌గా పనిచేశారు. సోమవారం జరిగిన సెబీ బోర్డు సమావేశంలో కొత్త నియామకాన్ని ఖరారు చేశారు. ప్రధానమంత్రి అధ్యక్షతన పనిచేసే ఓ కమిటీ ద్వారా జరిగే ఈ నియామకం… పలు అంశాల ప్రాతిపదికన, అధ్యయనం చేసి కొత్త నియామకాన్ని చేపడుతుంది. పూరీ బుచ్… సెక్యూరిటీస్ మార్కెట్ వాచ్‌డాగ్‌కు నాయకత్వం వహించిన మొదటి మహిళ. ప్రైవేటు రంగం నుండి ఎంపికైన మొదటి వ్యక్తి. మాధబి పూరీ ఐఐఎం-అహ్మదాబాద్ పూర్వ విద్యార్థిని.