PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏప్రిల్ 22 నుంచి ఇంటర్ పరీక్షలు

1 min read

– హాజరుకానున్న 76,264 మంది విద్యార్థులు

  •  పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించిన డిఆర్ఓ వి డేవిడ్ రాజు

పల్లెవెలుగు వెబ్​, ఏలూరు: ఇంటర్మీడియట్ ప్రథమ,ద్వితీయ సంవత్సర పరీక్షలకు ప్రభుత్వం విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించేందుకు  పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి వి. డేవిడ్ రాజు సూచించారు.గురువారం స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో డిఆర్ఓ వి.డేవిడ్ రాజు సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియేట్ థియరీ పరీక్షలు ఏప్రియల్ 22 నుంచి మే 12 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయన్నారు.ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు మార్చి 11 నుంచి మార్చి 31 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎత్నిక్ మరియు హ్యూమన్ వాల్యూస్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్టులు తీసుకున్న వారికి మార్చి 7, 9 తేదీల్లో ఈ పరీక్షలు ఉంటాయన్నారు.ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 39 వేల 718, రెండో సంవత్సరం పరీక్షలకు 36 వేల 546 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నరని,మొత్తం 76, 264 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారాన్నరు. ఈ పరీక్షల నిర్వహణకు 109 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు 57 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.  పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మాల్ ప్రాక్టీస్ కు తావు లేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖాధికారి కి డిఆర్ఓ సూచించారు.సమావేశంలో ఆర్ఐఓ, డీఈసీ కన్వీనర్ ఎస్ చంద్రశేఖర్ బాబు, డిఈఓ సి. వీ. రేణుక, డీఎంహెచ్ఓ డా.బి. రవి, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు కె .వి. సత్యనారాయణ, ఎస్. సత్యనారాయణ ,యం.పేర్రాజు, త్రీ టౌన్ సి ఐ వరప్రసాద్,విద్యుత్, ఆర్టీసి,పోస్టల్,పంచాయతీ  తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author