అందుకే హత్య చేయాలనుకున్నాం !
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితుడు రాఘవేంద్ర రాజు కీలక విషయాలు పోలీసు విచారణలో వెల్లడించారు. తన వ్యాపారాలు దెబ్బతీసి, ఆర్థికంగా తనకు నష్టం చేకూర్చాడని, అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేవశాడని విచారణలో వెల్లడించారు. అక్రమ కేసులు నమోదు చేయించడంతో పాటు తన స్థిరాస్థి వ్యాపారన్ని దెబ్బతీశాడని రాఘవేంద్రరాజు పేర్కొన్నారు. తన బార్ మూసేయించారని, అక్రమంగా ఎక్సైజ్ పోలీసులతో కేసులు పెట్టించారని తెలిపారు. తన ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రం అనుమతి రద్దు చేయించినట్టు నిందితుడు తెలిపారు. ఈ కారణంగా హత్యకు కుట్రపన్నినట్టు రాఘవేంద్రరాజు తెలిపారు.