వీడని యుద్ధ భయం.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలను యుద్ధ భయం వీడడం లేదు. అంతర్జాతీయ సూచీలతో పాటు భారత సూచీలు కదులుతున్నాయి. ఉక్రెయిన్ లోని జఫోరిషియా న్యూక్లియర్ ప్లాంట్ పై రష్యా కాల్పులకు తెగబడటంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. న్యూక్లియర్ ప్లాంట్ కనుక పేలితే జరిగే నష్టం అంచనాలకు అందదని నిపుణులు చెబుతున్నారు. ఐరపో మొత్తం అంతమయ్యే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ ఎలాంటి సానుకూల సంకేతాలు వెలుడటం లేదు. యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఇండియా వాణిజ్య లోటు పెరిగింది. ఇది కూడ ఇన్వెస్టర్ల భయానికి కారణమైంది. ఎఫ్ ఎంసీజీ సెక్టార్లో వృద్ధి క్షీణించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ ఎంసీజీ సరకుల కొనుగోళ్లు క్షీణించాయి. ఈ అంశాల కారణంగా చివరి గంటలో సూచీలు భారీ నష్టానికి గురయ్యాయి. సెన్సెక్స్ 810 పాయింట్ల నష్టంతో 54292 వద్ద్, నిఫ్టీ 244 పాయింట్ల నష్టంతో 16253 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.