న్యూక్లియర్ ప్లాంట్ లో మంటలు ఆర్పిన ఉక్రెయిన్.. ఊపిరి పీల్చుకున్న యూరప్
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యా దళాల బాంబు దాడిలో జపొరిషియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో చెలరేగిన మంటలను ఆర్పేసినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. రేడియేషన్ లెవెల్స్‌లో మార్పులు ప్రస్తుతానికి కనిపించలేదని ఉక్రెయిన్ స్టేట్ న్యూక్లియర్ రెగ్యులేటర్ తెలిపింది. అయితే ఈ ప్లాంటు రష్యన్ దళాల నియంత్రణలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూక్లియర్ ప్లాంట్ అధికార ప్రతినిధి ఆండ్రియ్ టుజ్ ఉక్రెయిన్ టెలివిజన్‌తో మాట్లాడుతూ, రష్యా దళాలు ప్రయోగించిన బాంబులు నేరుగా తమ ప్లాంటుపై పడ్డాయన్నారు. దీనిలో ఆరు రియాక్టర్లు ఉన్నాయని, ప్రస్తుతం కార్యకలాపాలు జరగని, ఆధునికీకరణ పనులు జరుగుతున్న రియాక్టర్‌పై బాంబులు పడ్డాయని చెప్పారు.