ఆపరేషన్ లేకుండానే… గాయం.. మాయం..
1 min readఆర్థోస్కోపిలో నూతన ఒరవడి..
– ఆర్థోపెడిక్ సర్జన్ డా. జివిఎస్ రవిబాబు
పల్లెవెలుగు వెబ్: ప్రమాదాలకు గురైనప్పుడు… క్రీడాకారులు ఆటలాడిప్పుడు వచ్చే కీళ్లనొప్పులు, మూగ గాయాలను నయం చేసేందుకు ఆర్థోస్కోపిలో నూతన మార్పులు వచ్చాయన్నారు ఆర్థోపెడిక్సర్జన్ డా. జివిఎస్ రవిబాబు. శనివారం ఆయన మాట్లాడుతూ చాలామందికి ముఖ్యంగా క్రీడాకారులకు తెలియని మూగ గాయాలు వాహనాలు నడిపి ప్రమాదవశాత్తు ప్రమాదాలకు గురైన వ్యక్తులు వారి యొక్క ఎముకలు మరియు కండరాలు సరిగా పనిచేయకపోవడంతో వారు మాకు ఏమో అయిపోయిందని మానసికంగా ఆవేదనకు గురిఅవుతుంటారు. కానీ కీహోల్ ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చని తెలిపారు. గతంలో లో ఏవైనా ప్రమాదాలకు గురియై గాయాలు అయినప్పుడు లిజి మెంట్సె డిగ్రీ ఆపరేషన్ జరిపేవారు. దెబ్బలు తగిలిన చోట చర్మాన్ని కోసి ఆపరేషన్ ద్వారా చికిత్స చేసేవారు అందువలన మన చాలా మందికి గాయాలు అయిన నొప్పితో బాధపడుతూ ఉన్న ఎక్కడ ఆపరేషన్ చేస్తారో అనే భయం చాలామందిలో ఉంది. అందువలన దెబ్బలు తగిలిన వెంటనే డాక్టర్ ను సంప్రదిస్తే తగిలిన గాయాలకు ఆర్థోస్కోపీ అనేక నూతన విధానం వచ్చాయి.
ఎక్కడ ఆపరేషన్ లేకుండా గాయం అయిన చోట మాత్రమే కీహోల్ ద్వారా కెమెరాను పంపించి ఎక్కడైతే గాయాలు అయినాయో అక్కడ మాత్రమే చిన్న రంధ్రం ద్వారా ఏ ఏ కండరాలు మరియు కీళ్లు,ఎముకలు విరిగయో గుర్తించి మనలో ఉన్న ఏసీ లిజిమెంట్స్, బి సి లిజిమెంట్స్ అనే కండరాలు ఉంటాయి ఆర్థో స్కోపీ ద్వారా గాయాలైన కండరాలను గుర్తించి ఇన్స్టలేషన్ ద్వారా కణాలను పంపి గాయాలను సరిచేయవచ్చు అని తెలిపారు.