గ్రామ గ్రామానికి ధర్మ ప్రచారం
1 min read– పీఠాధిపతులు గురు ఎల్లప్పస్వామి
పల్లెవెలుగు వెబ్: ఇల్లు, గ్రామము, దేశము , ప్రపంచం బాగుండాలంటే ధర్మాన్ని ఆశ్రయించాలని , ధర్మాన్ని ఆశ్రయిస్తే ఆ ధర్మమే మనలను కాపాడుతుందని శ్రీ శ్రీ సద్గురు పరిపూర్ణ తాండవ నాగలింగ శివాచార్య శివాజీవైక్య మఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ ఎల్లప్పస్వామి అన్నారు. వెల్దుర్తి మండలం, చెణుకులపాడు గ్రామంలోని శివాలయం నందు అఖండ శివ పంచాక్షరీ మంత్ర సప్తాహకార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలియుగంలో ఎందరో మహనీయులు నామ సంకీర్తనా యజ్ఞం ద్వారా ముక్తిని పొందిన ఎందరో మహనీయుల చరిత్రలను, భక్తుల జీవితాలను వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ మనకు ఎందరో మహనీయులు చూపిన మార్గంలో నడవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కామధేను గోశాల వ్యవస్థాపకులు బలిజ శ్రీరాములు, శివమాలా గురుస్వామి ఎల్లప్పస్వామి, పత్తికొండ ఎం ఎల్ ఏ కంగాటి శ్రీదేవమ్మ ,వై.ఎస్.ఆర్. పార్టీ రాష్ట్ర నాయకులు కంగాటి ప్రదీప్ కుమార్ రెడ్డి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యం గిడ్డయ్య సాహితీ పురస్కార సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వైద్యం రామానాయుడు, హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ మరియు సీతమ్మ కొండ అభివృద్ధి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు హరిసింహ నాయుడు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.