PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ విగ్ర‌హం ప‌క్క‌న అంబేద్క‌ర్ విగ్ర‌హం పెట్ట‌కూడ‌దా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ మౌన దీక్ష నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంచారన్నారు. వీహెచ్ మాట్లాడుతూ.. ‘‘బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహం గురించి ఎందుకు మాట్లాడరు? అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకపోతే ఎన్ని త్యాగాలు చేసినా తెలంగాణ వచ్చేదా? వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం పక్కనే అంబేద్కర్ విగ్రహం పెడితే తప్పేంటి? ఈటల రాజేందర్ ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడటం లేదు? అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలి“ అని అన్నారు.

                                       

About Author