బీజేపీ అధ్యక్షుడి పై దాడి.. !
1 min readపల్లెవెలుగువెబ్ : తృణమూల్ కాంగ్రెస్ గూండాలు తన కాన్వాయ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంతా మజుందార్ ఆరోపించారు. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా మధురాపూర్ వద్ద సోమవారం ఈ ఘటన జరిగినట్లు ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సుకాంతా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సుకాంతా కాన్వాయ్ వెళ్తుండగా, నల్ల జెండాలు పట్టుకున్న కొందరు వ్యక్తులు, ఆయన కారును అడ్డగించారు. సుకాంత గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ, దాడికి యత్నించారు.